ఒక భాషను ఎంచుకోండి

mic

unfoldingWord 25 - సాతాను యేసును శోధించడం

unfoldingWord 25 - సాతాను యేసును శోధించడం

రూపురేఖలు: Matthew 4:1-11; Mark 1:12-13; Luke 4:1-13

స్క్రిప్ట్ సంఖ్య: 1225

భాష: Telugu

ప్రేక్షకులు: General

ప్రయోజనం: Evangelism; Teaching

Features: Bible Stories; Paraphrase Scripture

స్థితి: Approved

స్క్రిప్ట్‌లు ఇతర భాషల్లోకి అనువాదం మరియు రికార్డింగ్ కోసం ప్రాథమిక మార్గదర్శకాలు. ప్రతి విభిన్న సంస్కృతి మరియు భాషలకు అర్థమయ్యేలా మరియు సంబంధితంగా ఉండేలా వాటిని అవసరమైన విధంగా స్వీకరించాలి. ఉపయోగించిన కొన్ని నిబంధనలు మరియు భావనలకు మరింత వివరణ అవసరం కావచ్చు లేదా భర్తీ చేయబడవచ్చు లేదా పూర్తిగా విస్మరించబడవచ్చు.

స్క్రిప్ట్ టెక్స్ట్

ప్రభువైన యేసు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయనను అరణ్యం లోనికి తీసుకొని వెళ్ళాడు, యేసు అక్కడ నలుబది రోజులు ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఉపవాసం ఉన్నాడు, సాతాను యేసు వద్దకు వచ్చి ఆయనను పాపం లోనికి పడేలా శోధించాడు.

మొదట సాతాను యేసుతో ఇలా చెప్పాడు, “నీవు నిజముగా దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను.”

అయితే యేసు సాతానుతో ఇలా సమాధానం ఇచ్చాడు, “దేవుని వాక్యంలో ఇలా రాసి ఉంది. ‘మనుష్యులు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని వాక్యము వలన జీవించును.”

అప్పుడు సాతాను యేసును ఒక ఎత్తైన ప్రాంతానికి తీసుకొని వెళ్లి ఆయనతో “నీవు దేవుని కుమారుడివైతే కిందికి దుముకుము, ‘దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించగా వారు నీ పాదములకు రాయి తగులకుండ నిన్ను ఎత్తి పట్టుకొంటారు” అని చెప్పాడు.

సాతాను అడిగిన దానిని చెయ్యడం యేసుకు ఇష్టం లేదు. దానికి బదులుగా ఆయన ఇలా చెప్పాడు, “నీ ప్రభువైన దేవుణ్ణి నీవు శోధించకూడదు.”

తరువాత సాతాను ప్రభువైన యేసుకు ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపించాడు. ఆవి ఎంత శక్తివంతమైనవో ఎంత సంపదలతో కూడుకొన్నవో చూపించాడు. ప్రభువుతో ఇలా చెప్పాడు, “నీవు నాకు మొక్కి నన్ను ఆరాధిస్తే నేను వాటిని నీకు దయచేస్తాను.”

ప్రభువైన యేసు ఇలా సమాధాన మిచ్చాడు, “సాతానా నన్ను విడిచి పొమ్ము! ‘నీ ప్రభువైన దేవుని మాత్రమే నీవు పూజించాలి’ అని రాయబడియున్నది.”

సాతాను శోధనలలో యేసు పడిపోలేదు. కనుక సాతాను ఆయనను విడిచిపెట్టాడు. అప్పుడు దేవుని దూతలు ఆయనకు పరిచర్య చేసారు.

సంబంధించిన సమాచారం

జీవపు మాటలు - రక్షణ మరియు క్రైస్తవ జీవనం గురించి బైబిల్ ఆధారిత సందేశాలను కలిగి ఉన్న వేలాది భాషలలో ఆడియో సువార్త సందేశాలు.

Choosing the audio or video format to download - What audio and video file formats are available from GRN, and which one is best to use?

Copyright and Licensing - GRN shares its audio, video and written scripts under Creative Commons