ஒரு மொழியை தேர்ந்தெடுக

mic

unfoldingWord 05 - వాగ్దాన పుత్రుడు

unfoldingWord 05 - వాగ్దాన పుత్రుడు

சுருக்கமான வருணனை: Genesis 16-22

உரையின் எண்: 1205

மொழி: Telugu

சபையினர்: General

செயல்நோக்கம்: Evangelism; Teaching

Features: Bible Stories; Paraphrase Scripture

நிலை: Approved

இந்த விரிவுரைக்குறிப்பு பிறமொழிகளின் மொழிபெயர்ப்பிற்கும் மற்றும் பதிவு செய்வதற்கும் அடிப்படை வழிகாட்டி ஆகும். பல்வேறு கலாச்சாரங்களுக்கும் மொழிகளுக்கும் பொருத்தமானதாக ஒவ்வொரு பகுதியும் ஏற்ற விதத்தில் இது பயன்படுத்தப்படவேண்டும்.சில விதிமுறைகளுக்கும் கோட்பாடுகளுக்கும் ஒரு விரிவான விளக்கம் தேவைப்படலாம் அல்லது வேறுபட்ட கலாச்சாரங்களில் இவை தவிர்க்கப்படலாம்.

உரையின் எழுத்து வடிவம்

అబ్రాము, శారాయి కనానుదేశంలో పదేళ్ళు కాపురమున్న తరువాత వారికి ఇంకా సంతానం కలుగలేదు. అందుచేత అబ్రాము భార్య శారాయి అబ్రాముతో ఇలా చెప్పింది, “బిడ్డలు కనుటకు దేవుడు నాకు అనుమతినివ్వని కారణంగా ఇదిగో నా దాసీ, హాగరు. ఆమెను కూడా వివాహం చేసుకో, నాకొరకు ఆమె నీకు కుమారుణ్ణి కంటుంది.”

అందుచేత అబ్రాము హాగరును వివాహం చేసుకొన్నాడు,  అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది. కుమారుణ్ణి కనింది. అబ్రాము ఆ బాలునికి ఇష్మాయేలు అనె పేరు పెట్టాడు. అయితే శారాయి హాగరు పట్ల చిన్న చూపు చూచింది. ఇష్మాయేలు పదుమూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు మరల అబ్రాముతో మాట్లాడాడు.

దేవుడు ఇలా చెప్పాడు, “నేను అమిత శక్తిగల దేవుణ్ణి . నా సముఖంలో నిందారహితుడు గా మెలుగుతూ ఉండు. నీకూ నాకూ మధ్య నా ఒడంబడిక సుస్థిరం చేస్తాను. నీ సంతతి సంఖ్య అత్యధికంగా చేస్తాను.” అబ్రాము సాష్టాంగపడ్డాడు. దేవుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, “ఇదిగో, విను, నా ఒడంబడిక నీతో చేశాను. నీవు అనేక జనాలకు తండ్రివి అవుతావు. నీకూ నీ తరువాత నీ సంతతివారికీ దేవుడై ఉంటాను. నీ కుటుంబంలో పురుషులందరూ సున్నతి సంస్కారం పొందాలి.”

దేవుడు అబ్రాహాముతో ఇంకా అన్నాడు, “నీ భార్య శారై సంగతి – నీవు ఆమెను శారై అనకు. ఇకమీదట ఆమె పేరు శారా.నేను ఆమెను దీవించి ఆమెవల్ల నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాను. బాలునికి ఇస్సాకు అని పేరు పెడతావు. నేను ఇస్సాకుతో ఒడంబడిక చేస్తాను. అతనిని గొప్ప జనాంగముగా చేస్తాను. ఇష్మాయేలును గొప్ప జనాంగముగా చేస్తాను. అయితే నా ఒడంబడిక ఇస్సాకుతో ఉంటుంది.” అప్పుడు దేవుడు అబ్రాము పేరును అబ్రాహాముగా మార్చాడు. ఆ మాటకు అర్థం “జనములకు తండ్రి.” దేవుడు శారాయి పేరును కూడా ‘శారా’గా మార్చాడు, ఆ మాటకు అర్థం “రాకుమారి.”

దేవుడు తనతో చెప్పినట్టు ఆ రోజునే అబ్రాహాము తన కొడుకు ఇష్మాయేల్‌కు అతని మర్మాంగ చర్మానికి సున్నతి చేశాడు. తన దాసుల్లోనూ తాను డబ్బిచ్చి కొనుకొన్నవారిలోనూ మగవాళ్ళందరికీ అలా చేశాడు. ఒక సంవత్సరం తరువాత అబ్రాహాము వయస్సు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు శారా వయసు 90 సంవత్సరాలు ఉన్నప్పుడు శారా అబ్రహాముకు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. దేవుడు వారికి చెప్పిన విధంగా వారు ఆ బాలునికి ఇస్సాకు అని పేరుపెట్టారు.

ఇస్సాకు యువకునిగా ఉన్నప్పుడు దేవుడు అబ్రాహామును పరిశోధించాడు “అతణ్ణి “అబ్రాహామూ” అని పిలవగా అతడు “చిత్తం, ప్రభూ” అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, “నీ ఒకే ఒక కొడుకును – నీ ప్రేమ చూరగొన్న కొడుకైన ఇస్సాకును తీసుకొని మోరీయా ప్రదేశానికి వెళ్ళు. అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతం మీద అతణ్ణి హోమబలిగా అర్పించు.” మరల అబ్రహాము దేవునికి లోబడ్డాడు. తన కుమారుడిని దేవునికి బలిగా అర్పించదానికి సిద్ధపడ్డాడు.

వారిద్దరూ కలిసి బలి అర్పించే స్థలానికి సాగిపోతూ ఉంటే, ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును ఉద్దేశించి “నాన్నా” అన్నాడు. అబ్రాహాము “ఏం బాబు?” అన్నాడు. “ఇవిగో నిప్పూ కత్తీ ఉన్నాయి గానీ, హోమబలికోసం గొర్రెపిల్ల ఎక్కడ?” అని అడిగాడు ఇస్సాకు. “దేవుడే హోమబలికోసం గొర్రెపిల్లను చూచుకొంటాడు బాబూ” అని అబ్రాహాము జవాబిచ్చాడు.

దేవుడు చెప్పిన బలి స్థలానికి వారు చేరుకొన్నప్పుడు అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠం కట్టి దానిమీద కట్టెలు చక్కగా పేర్చాడు. తన కొడుకైన ఇస్సాకును బంధించాడు, ఆ పీఠం మీద ఉన్న కట్టెలమీద పెట్టాడు. అప్పుడు అబ్రాహాము తన కొడుకును వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకొన్నాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, “అబ్బాయి మీద చెయ్యి వేయకు, దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసిపోయింది, ఎందుకంటే నీ ఒకే ఒక కొడుకును నాకివ్వడానికి వెనక్కు తీయలేదు.

అప్పుడు అబ్రాహాము తలెత్తి చూడగా వెనుక దిక్కున పొదలో కొమ్ములు చిక్కుకొన్న ఒక పొట్టేలు కనిపించింది. ఇస్సాకు స్థానంలో దేవుడు ఒక పొట్టేలును అనుగ్రహించాడు. అబ్రహాము దానిని పట్టుకొని, తన కొడుకు స్థానంలో హోమబలిగా సమర్పించాడు.

అప్పుడు దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నాడు, “నీవిలా చేసి నీ ఒకే ఒక కొడుకును ఇవ్వడానికి వెనక్కు తీయలేదు. గనుక నేను నిన్ను తప్పనిసరిగా దీవిస్తాను. నీ సంతానాన్ని తప్పక వృద్ధి చేసి, లెక్కకు ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్రతీరం ఇసుక రేణువులలాగా చేస్తాను. నీ సంతానం మూలంగా లోకంలోని జనాలన్నీ ధన్యమవుతాయి అని నాతోడని ప్రమాణం చేశాను. ఎందుకంటే, నీవు నా మాట విన్నావు.”

தொடர்புடைய தகவல்கள்

ஜீவனுள்ள வார்த்தைகள் - இரட்சிப்பை பற்றியும் கிறிஸ்தவ ஜீவியத்தை பற்றியும் GRN ஆயிரக்கணக்கான மொழிகளில் வேதாகம செய்திகளை ஆடியோவில் சுவிஷேச செய்திகளாக கொண்டுள்ளது.

Choosing the audio or video format to download - What audio and video file formats are available from GRN, and which one is best to use?

Copyright and Licensing - GRN shares its audio, video and written scripts under Creative Commons