unfoldingWord 20 - బహిష్కరణ, తిరిగి రావడం
ዝርዝር: 2 Kings 17; 24-25; 2 Chronicles 36; Ezra 1-10; Nehemiah 1-13
የስክሪፕት ቁጥር: 1220
ቋንቋ: Telugu
ታዳሚዎች: General
ዓላማ: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
ሁኔታ: Approved
ስክሪፕቶች ወደ ሌሎች ቋንቋዎች ለመተርጎም እና ለመቅዳት መሰረታዊ መመሪያዎች ናቸው። ለእያንዳንዱ የተለየ ባህል እና ቋንቋ እንዲረዱ እና እንዲስማሙ ለማድረግ እንደ አስፈላጊነቱ ማስተካከል አለባቸው። አንዳንድ ጥቅም ላይ የዋሉ ቃላቶች እና ጽንሰ-ሐሳቦች የበለጠ ማብራሪያ ሊፈልጉ ወይም ሊተኩ ወይም ሙሉ ለሙሉ ሊተዉ ይችላሉ.
የስክሪፕት ጽሑፍ
ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసారు. దేవుడు సీనాయి పర్వతం వద్ద వారితో చేసిన నిబంధనను వారు మీరారు. వారు తమ పాపం విషయంలో పశ్చాత్తాపపడాలని, తిరిగి ఆయనను ఆరాధించాలని హెచ్చరించడానికి దేవుడు తన ప్రవక్తలను పంపించాడు. అయితే ప్రజలు విధేయత చూపించడానికి నిరాకరించారు.
అందుచేత దేవుడు రెండు రాజ్యాలనూ శిక్షించాడు, వాఋ నాశనం అయ్యేలా వారి మీదకు శత్రువులను అనుమతించాడు. మరొక జనాంగం అష్శూరీయులు చాలా బలమైన దేశంగా తయారయ్యారు. ఇతర దేశాల పట్ల వారు చాలా క్రూరంగా ఉండేవారు. వారు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి వారిని నాశనం చేసారు. ఇశ్రాయేలు రాజ్యంలోని అనేకమందిని వారు చంపారు. వారికి నచ్చిన ప్రతీ వస్తువుని వారు తీసుకొని వెళ్ళారు. దేశంలోని అధిక భాగాన్ని కాల్చివేసారు.
దేశంలోని నాయకులందరినీ సమావేశపరచుకొన్నారు, ధనికులు, విలువైన వస్తువులను చెయ్యగలవారిని సమావేశపరచారు. వారిని తమతో అస్సీరియా తీసుకొని వెళ్ళారు. కేవలం కొద్దిమంది పేద ఇశ్రాయేలీయులను మాత్రమే ఇశ్రాయేలులో విడిచిపెట్టారు.
అప్పుడు అస్సీరియనులు ఆ దేశంలో నివసించడానికి పరదేశీయులను తీసుకొని వచ్చారు. పరదేశులు నగరాలను కట్టారు. అక్కడ నివసిస్తున్న మిగిలిన ఇశ్రాయేలు వారిని వివాహం చేసుకొన్నారు. ఈ సంతానాన్ని సమరయులు అని పిలిచారు.
దేవుణ్ణి విశ్వసించకపోవడం, ఆయనకు విధేయత చూపించక పోవడం వలన దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని ఏవిధంగా శిక్షించాడో యూదా రాజ్యం చూసారు. అయినా వారు విగ్రహాలను పూజిస్తూనే వచ్చారు, కనానీయ దేవతలను కూడా వారు పూజిస్తున్నారు. వారిని హెచ్చరించడానికి దేవుడు వారి వద్దకు ప్రవక్తలను పంపాడు, అయితే వారు వినడానికి నిరాకరించారు.
అస్సీరియులు ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేసిన తరువాత 100 సంవత్సరాలకు దేవుడు బబులోను రాజు నెబుకద్నజరును యూదా రాజ్యం మీదకు దాడి చెయ్యడానికి పంపాడు. బబులోను అత్యంత శక్తివంతమైన దేశం. యూదా రాజు నెబుకద్నెజరు రాజుకు సేవకునిగా ఉండడానికి అంగీకరించాడు, ప్రతీ సంవత్సరం రాజుకు పెద్ద మొత్తంలో కప్పము కట్టడానికి అంగీకరించాడు.
అయితే కొద్ది సంవత్సరాల తరువాత యూదా రాజు బబులోను రాజుకు వ్యతిరేకంగా దాడి చేసాడు. కనుక బబులోను వారు యూదా రాజ్యం మీద దాడి చేసారు. వారు యెరూషలెం పట్టణాన్ని ఆక్రమించారు, దేవాలయాన్ని నాశనం చేసారు, నగరంలోనూ, దేవాలయంలోనూ ఉన్న విలువైన సంపదను తీసుకొని వెళ్ళారు.
యాదారాజు తిరుగుబాటును బట్టి యూదా రాజును శిక్షించడం కోసం నెబుకద్నజరు సైనికులు రాజు కుమారులను అతని కళ్ళెదుటనే వారిని చంపారు. తరువాత అతనిని గుడ్డివానిగా చేసారు. ఆ తరువాత రాజును తీసుకొనివెళ్ళారు, అక్కడ బబులోను చెరలో రాజు చనిపోయాడు.
నెబుకద్నెజరూ, అతని సైనికులూ యూదా రాజ్యంలో దాదాపు ప్రజలందరినీ బబులోనుకు తీసుకొనివెళ్ళారు. అతి పేదవారిని పొలాలలో పనిచెయ్యడానికి అక్కడ ఉంచివేసారు. ఈ కాలంలో దేవుని ప్రజలు వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టేలా వారిని బలవంతపెట్టారు, దీనిని బహిష్కరణ అన్నారు.
దేవుడు తన ప్రజలను వారి పాపాన్ని బట్టి వారిని దేశబహిష్కరణకు అనుమతించినప్పటికీ వారినీ, వారికి చేసిన వాగ్దానాలను మరచిపోలేదు. దేవుడు వారిని గమనిస్తూ ఉన్నాడు, తన ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. డెబ్బది సంవత్సరాల తరువాత వారు తమ వాగ్దానదేశానికి తరిగి వస్తారని వాగ్దానం చేసాడు.
డెబ్బది సంవత్సరాల తరువాత పర్షియా దేశ రాజు కోరేషు బబులోనును జయించాడు, కనుక పర్షియా చక్రవర్తి బబులోను చక్రవర్తికి బదులు అనేక దేశాలను పరిపాలించాడు. ఇశ్రాయేలీయులను ఇప్పుడు యూదులు అని పిలుస్తున్నారు. వారిలో అనేకులు తమ పూర్తి జీవితాలు బబులోనులో గడిపారు.
పర్షియా వారు చాలా బలమైనవారు, అయితే వారు జయించిన ప్రజల మీద వారు దయను చూపించారు. త్వరలోనే కోరేషు పర్షియా దేశం మీద రాజుగా నియమించబడిన తరువాత యూదా దేశానికి తిరిగి వెళ్లాలని కోరిన యూదులు పర్షియా దేశాన్ని విడిచి పెట్టవచ్చని ఆజ్ఞలు జారీ చేసాడు. దేవాలయాన్ని తిరిగి కట్టడానికి ధనసహాయం కూడా చేసాడు! కనుక బబులోను చెరలో డెబ్బది సంవత్సరాల తరువాత ఒక చిన్న యూదుల గుంపు యూదాలోని యెరూషలెం పట్టణానికి తిరిగి వెళ్ళారు.
వారు యెరూషలెం నగరానికి తిరిగి వచ్చినప్పుడు వారు దేవాలయాన్ని తిరిగి కట్టారు, నగరం ప్రాకారాలు కట్టారు. పర్షియా వారు ఇంకా వారిని పాలిస్తున్నారు. అయితే తిరిగి వారు వాగ్దానదేశంలో నివసించడం, దేవాలయంలో ఆరాధన చేస్తూవచ్చారు.